Mahesh Kumar Goud: ఖర్గేకు కవిత లేఖ.. తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు.

Update: 2025-07-03 09:20 GMT

Mahesh Kumar Goud: ఖర్గేకు కవిత లేఖ.. తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసిన విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… “కవిత ఆ లేఖను భారత రాష్ట్ర సమితి నాయకురాలిగా రాశారా? లేక జాగృతి అధ్యక్షురాలిగా రాశారా?” అని ప్రశ్నించారు.

పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి ఒక్కమాటైనా మాట్లాడిందా? అని నిలదీశారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 21 శాతంకు తగ్గించినది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. 2014 నుండి 2018 వరకూ తెలంగాణ క్యాబినెట్‌లో ఒక్క మహిళకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వంపై అప్పట్లో కవిత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. “ఉద్యమాల గురించి గొప్పగా చెప్పుకునే కవిత ఏనాడైనా సాటి మహిళల గురించి గొంతెత్తిందా?” అని మహేశ్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు.

అలాగే, ఈ నెల 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో సామాజిక సమరభేరి పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రామ కమిటీలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు.

Tags:    

Similar News