New TPCC Cheif: టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌

New TPCC Cheif: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌

Update: 2024-09-06 11:15 GMT
New TPCC Cheif: టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌
  • whatsapp icon

New TPCC Chief: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉంది. అయితే అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపింది. పార్టీలో అందరిని సమన్వయం చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ కు పేరుంది.


Tags:    

Similar News