Mahbubnagar: గొంతులో పూరీ ముక్క ఇరుక్కుని.. ఊపిరాడక..
Mahbubnagar: మహాబూబ్‌నగర్ రాజ్ పూర్ మండలం ఖానాపూర్‌లో విషాధ చాయలు అలుముకున్నాయి.
Mahbubnagar: మహాబూబ్‌నగర్ రాజ్ పూర్ మండలం ఖానాపూర్‌లో విషాధ చాయలు అలుముకున్నాయి. పూరీ తింటుండగా గొంతులో ఇరుక్కుని ఒక యువకుడు ఊపిరాడక మృతి చెందాడు. పండగ రోజు కొడుకు పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
తొలి ఏకాదశి పండుగ రోజు ఖానాపూర్‌లో విషాధ చాయలు అలుముకున్నాయి. పొలంలో తింటున్న పూరీ ఒకసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక బ్యాగరి కుమార్ అనే 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
తిల్లాపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి అనే రైతు దగ్గర బ్యాగరి కుమార్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తొలి ఏకాదశ సందర్భంగా ఆదివారం పొలానికి వెళ్లిన రాంరెడ్డి అందిరికీ పూరీలు తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడ పొలం పనులు చేస్తున్న కుమార్‌కి కూడా తినమని పూరీలు ఇచ్చాడు. అందరూ తింటున్న సమయంలో కుమార్ గొంతులో పూరీ ముక్క ఇరుక్కుపోయింది. దీంతో వెంటనే నీళ్లు తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే కుమార్ కిందపడి, ఊపిరాడక చనిపోయాడు.
ఏకాదశి రోజు కొడుకు చనిపోవడంతో తల్లి బోరున ఏడుస్తుంది ఇంటికి ఆధారం తన కొడుకేనని, ఇక పెద్ద దిక్కును పోగొట్టుకున్నామని కుమార్ తల్లి, చెల్లి విలపిస్తున్నారు. కుమార్ మృతితో ఖాన్ పూర్‌లో విషాధ చాయలు నెలకొన్నాయి.