మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్.. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ MBBSలు..
KTR: రాజస్థాన్ టీఎన్ యూనివర్శిటీ నుంచి నకిలీ సర్టిఫికేట్లను పొందారు
KTR: బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ MBBSలు ఉన్నట్లు కనిపిస్తోంది
KTR: తెలంగాణ బీజేపీ ఎంపీలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ MBBSలు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికేట్ హోల్డర్లేనని.. రాజస్థాన్ టీఎన్ విశ్వవిద్యాలయాల నుంచి సర్టిఫికేట్లను పొందారని ఆరోపించారు. ఇవి ఎన్నికల అఫిడవిట్‌లో ఎలా పెడతారని..? ఏ ప్రాతిపదికన ఎంపీగా ఎన్నికవుతారంటూ నిలదీశారు. దోషిగా తేలితే లోక్‌సభ స్పీకర్ నిర్ధారించకూడదా?.. అనర్హులుగా ప్రకటించకూడదా?.. అని కేటీఆర్ ప్రశ్నించారు.