Liquor Shop Bund:హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం షాపులు బంద్!
మందుబాబులకు ఓ చెడు వార్త. సాయంత్రం కాలమే ఆలస్యం... బార్‌కు వెళ్లి మజా చేసేవారికి ఇది షాకింగ్ న్యూస్. హైదరాబాద్ సిటీలోని అన్ని మద్యం దుకాణాలు రెండు రోజులు మూత పడనున్నాయి.
Liquor Shop Bund:హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం షాపులు బంద్!
హైదరాబాద్: మందుబాబులకు ఓ చెడు వార్త. సాయంత్రం కాలమే ఆలస్యం... బార్‌కు వెళ్లి మజా చేసేవారికి ఇది షాకింగ్ న్యూస్. హైదరాబాద్ సిటీలోని అన్ని మద్యం దుకాణాలు రెండు రోజులు మూత పడనున్నాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు జూలై 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులను పూర్తిగా బంద్ చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎందుకీ నిర్ణయం?
జూలై 13న సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సంవత్సరం లాగానే, ఈసారి కూడా భద్రతా చర్యల్లో భాగంగా మద్యం విక్రయాన్ని 48 గంటల పాటు నిలిపివేస్తున్నారు.
బంద్ వర్తించే ప్రాంతాలు:
హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల పరిధిలోని గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తూకారాం గేట్, మారేడ్‌పల్లి, మహాంకాళి, రామ్ గోపాల్ పేట్, మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు.
పండుగ భద్రతే ప్రధాన కారణం
బోనాల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు ఆలయాలను సందర్శిస్తారు. ఆ సమయంలో తాగుబోతులు, ఆకతాయిల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహాంకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యవాణి ముఖ్య ఘట్టం
సికింద్రాబాద్ బోనాలలో మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి చేసే భవిష్యవాణి కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని "రంగం"గా పిలుస్తారు. దీన్ని చూడటానికి భారీగా భక్తులు తరలివస్తారు.
ఇదే సారి మీరు ప్లాన్ చేస్తున్నారంటే.. ముందే సిద్ధంగా ఉండండి. జూలై 13, 14 తేదీల్లో మద్యం దొరకదు!