Hyderabad: కాంతుల ధగధగలు.. ఎంజే నిండా వెలుగులు

హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్‌ కాంతుల ధగధగలతో సందర్శకులను ఆకర్శిస్తుంది. నగర నవీకరణ పనుల్లో భాగంగా ఎంజే మార్కెట్‌ ను లైట్ సెట్టింగులతో అందంగా రూపుదిద్దారు.

Update: 2020-02-29 10:15 GMT
ఎంజే మార్కెట్‌

హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్‌ కాంతుల ధగధగలతో సందర్శకులను ఆకర్శిస్తుంది. నగర నవీకరణ పనుల్లో భాగంగా ఎంజే మార్కెట్‌ ను లైట్ సెట్టింగులతో అందంగా రూపుదిద్దారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మరికొన్ని రోజుల్లో మిగిలిన పనులు అన్నీ పూర్తవుతాయని ఆయన తెలిపారు.

కాగా నవీకరణకు సంబంధించి విషయాలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో మున్సిపల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలునిర్వహిస్తున్నారు. దాంతో పాటుగానే అభివృద్ద్దికి సంబంధించిన పలు ఆదేశాలుజారీ చేస్తున్నారు. నగరంలో ఉన్న పూరాతన కట్టడాలను సుందరంగా మార్చాలని తెలిపారు. ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్‌ జంక్షన్‌ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్‌ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.

అంతే కాక నగరంలో కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్‌ సిస్టమ్, 98 ప్రాంతాల్లో ఫెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుకు సిద్ధమయ్యాయని వారు తెలిపారు. నగరంలో 65 ఫౌంటెన్లకుగాను తొలిదశలో 25 ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో ఆధునికీకరణ చేసారని తెలిపారు. ఇందుకు ఖర్చయ్యే రూ.59.86 కోట్లకు స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. 



Tags:    

Similar News