హైదరాబాద్ చైతన్యపురిలో లింగ నిర్ధారణ పరీక్షలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోన్న డాక్టర్ సరళను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లని

Update: 2019-11-21 16:54 GMT
లింగ నిర్ధారణ పరీక్షలు

 హైదరాబాద్ చైతన్యపురిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోన్న డాక్టర్ సరళను పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లని తేలితే అబార్షన్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ షీ టీమ్‌, చైతన్యపురి పోలీసులు, వైద్యారోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో ఈ బాగోతం బయటపడింది. లింగ నిర్ధారణ పరీక్షలకు తొమ్మిదివేల రూపాయలు వసూలు చేస్తోన్న డాక్టర్ సరళి, డాక్టర్ ఫాతిమాలు... ఆడపిల్లని తేలితే... వాళ్లను ఉషోదయ హాస్పిటల్‌కి తరలించి అబార్షన్లు కూడా చేయిస్తున్నారు. డాక్టర్ సరళ, డాక్టర్ ఫాతిమాను, ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... కార్లు, మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, మెడికల్ సామగ్రిని సీజ్ చేశారు. స్కానింగ్ అనేది కడుపులోని పిండ ఆరోగ్య విషయాలు మాత్రమే తెలుసుకునేలా ఉండాలని, ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Tags:    

Similar News