KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కేటీఆర్ క్షేత్రస్థాయి ప్రచారం
KTR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) నేటి (అక్టోబర్ 31) నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కేటీఆర్ క్షేత్రస్థాయి ప్రచారం
KTR: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) నేటి (అక్టోబర్ 31) నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయం కోసం ఆయన రోజూ ఒక రోడ్ షోలో పాల్గొననున్నారు.
ఈ రోడ్ షోలు నేడు (అక్టోబర్ 31) మొదలై నవంబర్ 8 వరకు కొనసాగుతాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజున (నవంబర్ 9) భారీ బైక్ ర్యాలీతో ప్రచారాన్ని ముగించనున్నారు.
ఇవాళ షేక్‌పేటలో రోడ్ షో, రేపు రహమత్‌నగర్,
నవంబర్ 2న యూసుఫ్‌గూడ, నవంబర్ 3న బోరంబండలో ప్రచారం
నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళ్‌రావునగర్‌లో..
నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్‌లో కేటీఆర్ రోడ్ షోలు
9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు BRS బైక్ ర్యాలీ
నవంబర్ 9న జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టివచ్చేలా షేక్‌పేట నుంచి బోరబండ వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు.
కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో, రాబోయే కొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హోరాహోరీగా మారనుంది.