KTR: కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలి
KTR: కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ అన్నారు.
KTR: కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి ముఖం చెల్లక... గండిపేట దగ్గర మూసీ పునరుజ్జీవం అని డ్రామా చేస్తున్నారని అన్నారు.
కాళేశ్వరం కల్పతరువు అనేది కాంగ్రెస్ ఒప్పుకుందని తెలిపారు. గండిపేటకు తీసుకొచ్చేది కాళేశ్వరం నీళ్లా కాదా సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు కేటీఆర్.