KTR: రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా
KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
KTR: రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా
KTR: కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేజర్ వర్గాలు అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యాయని.. రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అసహనంతో వ్యవహరిస్తోందన్న కేటీఆర్.. నేటికి 2 ఎకరాలకు మించి రైతుబంధు రాలేదన్నారు. కేఆర్‌ఎంబీపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని.. సీఎం అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పారన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.