మరోసారి పెద్ద మనసు చాటుకున్న కేటీఆర్‌..

Update: 2019-08-02 02:22 GMT

అన్న ఆపదలో ఉన్నా అంటే చాలు... ఆదుకోవడానికి ముందుకు వస్తారు. తోచిన సహాయం అందించి చేయూతనిస్తారు. మంచి మనసున్న మహారాజు కేటీఆర్ మరో దివ్యాంగుడికి ఆసరాగా నిలిచారు. ట్వీట్‌కు స్పందించి దివ్యాంగుడికి ఉద్యోగంతోపాటు గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లికి చెందిన దివ్యాంగుడు సందీప్ కుమార్ ‌కు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు శారీక వైకల్యాలు అడ్డుకాలేదు. కంప్యూటర్‌ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను నిర్వహించాడు. తన సోషల్ మీడియా నైపుణ్యాలను ఉపయోగించి సందీప్ కుమార్ కేటీఆర్‌కు ఉపాధి అవకాశం కోసం ట్వీట్ చేశాడు.

సందీప్ స్వయంగా ట్విట్టర్ ఖాతాను సృష్టించి ట్వీట్ చేసినట్లు తెలిసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. సందీప్‌ను తెలంగాణ భవన్‌కు పిలిపించుకున్నారు. అతని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆసరా పెన్షన్ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సందీప్‌కు ఉపాధి అవకాశం కల్పించాలని సందీప్ తల్లి లక్ష్మీ కేటీఆర్‌ను అభ్యర్థించారు.సందీప్‌కు గ్రామంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ఇస్తామని చెప్పారు కేటీఆర్. తమ కొడుకుకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్‌‌కు తల్లి లక్ష్మీ కృతజ్నతలు తెలిపింది.  

Full View

Tags:    

Similar News