పార్టీ సభ్యత్వ నమోదుపై కేటీఆర్ ఫోకస్

Telangan:టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలపై ఫోకస్ పెట్టిన కేటీఆర్.. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2021-03-02 01:10 GMT

ఫైల్ ఇమేజ్


తెలంగాణ : రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదుపై ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ ఫోకస్ పెట్టారు. అధిష్టానం సూచన ప్రకారం ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సభ్యత్వాలు నమోదు చేయించాల్సి ఉండగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం పూర్తి చేశారు. సుమారు 70 లక్షలకు పార్టీ సభ్యత్వం చేరిందని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించాలి..

పార్టీ కమిటీల నిర్మాణంపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఈ నెలాఖరు వరకు టిఆర్ఎస్ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ సభ్యత్వాల నమోదు చురుగ్గా కొనసాగుతోందని..ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50 వేల నుంచి సుమారు లక్ష వరకు సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరో వారం, పదిరోజులు సమయం కావాలి....

పార్టీ సభ్యత్వాల నమోదు పూర్తి చేసేందుకు మరో వారం, పదిరోజులు సమయం ఇవ్వాలని ప్రధాన కార్యదర్శులు కేటీఆర్ ను కోరారు. పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు.సభ్యత్వ నమోదు వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలీకరణ చేస్తున్నామని.. ఇప్పటికే దాదాపు సగం సభ్యత్వాల కంప్యూటరీకరణ పూర్తయిందని వివరించారు.

జనగాం ఎమ్మెల్యేల ఆరోగ్యంపై కు కేటీఆర్ ఆరా...

కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం ఎమ్మెల్యేలకు కేటీఆర్ ఫోన్ చేసి ఆరోగ్యంపై ఆరా తీశారు. లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు నమోదు చేయిస్తున్న పలువురు ఎమ్మెల్యేలను ఫోన్ చేసి అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకని పని చేయాలని మంత్రులకు సూచించారు.

Tags:    

Similar News