KTR: కొన్ని తప్పిదాల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాం.. ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ వెళ్లింది

KTR: పార్లమెంట్‌ నియోజకవర్గాలపై కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ సమీక్షలు

Update: 2024-01-10 09:03 GMT

KTR: కొన్ని తప్పిదాల వల్ల ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాం.. ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ వెళ్లింది

KTR: కొన్ని తప్పిదాల వల్ల ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. 10ఏళ్ల పాటు చల్లగా కాపాడుకున్నామని, ఇఫ్పుడు ఢిల్లీ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి మాట్లాడుకునే అవకాశం రాలేదన్న కేటీఆర్.. మన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ గళం, బలం ఢిల్లీలో వినపడాలంటే.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేడర్‌కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతి లేదని, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్‌ సమీక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో వరంగల్‌ సెగ్మెంట్‌ నేతలతో కేటీఆర్‌ భేటీ అయ్యారు.

Tags:    

Similar News