KTR: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా.. సీఎం అల్లుడు, మంత్రి కొడుకుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
KTR: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా నడుస్తుందన్నారు.
KTR: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా నడుస్తుందన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యం అని ఆరోపించారు. సీఎం అల్లుడికి.. మంత్రి కొడుకు మధ్య 500 కోట్ల టెండర్ గొడవలో రిజ్వీ అనే ఓ మంచి ఆఫీసర్ నలిగి పోయాడన్నారు. నలిగిపోవడం ఎందుకు అని రిజ్వీ వాలంటరీ రిటైర్‌మెంట్ అప్లై చేసుకుంటే మంత్రి ఆ రిటైర్‌మెంట్‌ను ఆమోదించవద్దని రిజ్వీపై ఎంక్వైరీ వేయాలని లేఖ రాశారని కేటీఆర్ విమర్శించారు.
సీఎం రేవంత్‌కు తొత్తులుగా రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తమ కార్యకర్తలు ఓ చిన్న పోస్ట్‌ను రీ-ట్వీట్ చేస్తే... 20 రోజులు జైలులో పెట్టారని.. ఇప్పుడు మంత్రి ఇంట్లో గన్ తో బెదిరింపులకు గురిచేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు.