ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం
*హాజరుకానున్న ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులు
ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం
Krishna Board Meeting: ఇవాళ కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు విడుదల చేయడంపై తెలంగాణ అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో.. ఇవాళ అత్యసవర సమావేశం ఏర్పాటు చేసింది కృష్ణా బోర్డు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించనుంది.