Komatireddy: సిద్దిపేట, సిరిసిల్ల... ఎక్కడి సబ్‌స్టేషన్‌ కైనా వెళ్దాం.. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నట్టు చూపిస్తే ...సబ్‌స్టేషన్‌లోనే రాజీనామా చేస్తా

Komatireddy: మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి

Update: 2023-07-12 07:57 GMT

Komatireddy: సిద్దిపేట, సిరిసిల్ల... ఎక్కడి సబ్‌స్టేషన్‌ కైనా వెళ్దాం.. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నట్టు చూపిస్తే ...సబ్‌స్టేషన్‌లోనే రాజీనామా చేస్తా

Komatireddy: మంత్రి కేటీఆర్ ట్వీట్ పై ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. మూడు గంటలు కావాలా మూడు పంటల కావాలన్న వ్యక్తి ని చెప్పుతోని కొట్టాలన్నారు కోమటిరెడ్డి . కావాలని సత్యగ్రహ దీక్ష ని బగ్నం చేయడానికి బీఆర్ఎస్ ఆడుతున్న కుట్ర అని ‎‎ఆయన విమర్శించారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్టుగా బీఆర్ఎస్ అపోహలు సృష్టిస్తుందని తెలిపారు. పిసిసి ఈరోజు రాత్రి హైదరాబాద్ వస్తారు. రేపు పిసిసి తో కలిసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఎమ్మెల్సీ కవిత పై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం నిరవ్ మోడీ లాగా దుబాయ్ పారిపోతుందన్నారు. కోమటిరెడ్డి రాబోయే కాలంకి కాబోయే ప్రధాని రాహుల్ అని తెలిపారు. ఇసుక ల్యాండ్ మాఫియాలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ 24 గంటలు కరెంట్ ఇస్తే ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇప్పిస్తాం అని మేనిఫెస్టో లో పెడతామన్నారు. కేటీఆర్ కి కొమటిరెడ్డి సవాల్ విసిరారు. సిరిసిల్ల సబ్ స్టేషన్ పోదాం . 24 గంటలు ఇస్తున్నట్టు చెప్తే రాజీనామా చేస్తానన్నారు.

Tags:    

Similar News