Raj Gopal Reddy: మంత్రి కేటీఆర్, రేవంత్‌కు రాజగోపాల్‌ రెడ్డి సవాల్..

Komatireddy RajGopalReddy: కేసీఆర్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేశాం.. నైతికంగా గెలిచాం

Update: 2023-03-04 09:30 GMT

Komatireddy RajGopalReddy: తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు.. కుటుంబ పాలన నడుస్తోంది

Komatireddy RajGopalReddy: మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. తాను అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. తనను ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు... కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలనను దించేందుకు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేశాం.. నైతికంగా గెలిచామన్నారు. అమిత్‌ షా నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాజగోపాల్‌రెడ్డి. 

Tags:    

Similar News