టీపీసీసీ చీఫ్ పదవి నాకు ఇచ్చి ఉంటే ... -కోమటిరెడ్డి రాజగోపాల్

Update: 2019-06-17 15:55 GMT

కాంగ్రెస్ అధిష్ఠానంపై మునుగోడు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రాజగోపాల్‌ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి తనకు ఇచ్చి ఉంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదన్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమని రాజగోపాల్ మరోసారి స్పష్టం చేశారు. అధిష్ఠానం తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ ఇచ్చి కూడా రెండు సార్లు అధికారాన్ని కోల్పోయామని.. కాంగ్రెస్‌ లోపాల వల్లే కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చారన్నారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి వెంట పార్లమెంట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే.. నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుటానని కోమటిరెడ్డి రాజగోపాల్‌ స్పష్టం చేశారు.  

Tags:    

Similar News