మంత్రుల వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు : కోదండరాం

- మంత్రుల అనుచిత వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు -మంత్రి అజయ్ చేసిన ప్రకటనతోనే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య -శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య -మరో సకల జనుల సమ్మె తథ్యం

Update: 2019-10-13 14:20 GMT

మంత్రుల అనుచిత వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరాం. నిన్న మంత్రి అజయ్ చేసిన ప్రకటనతోనే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య ఆరోపించారు. మరో సకల జనుల సమ్మె తథ్యమన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పూర్తి మద్దతు ఉంటుందంటుదని కోదండరాం అంటున్నారు.

ఈ నెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అంతే కాంకుడా 48వేల మందినిపైగా ఉద్యోగాల నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆర్టీసీ జేఏసీ అఖిపక్షల మద్దతు కోరింది. దీనికి అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. కాగా.. శనివారం శ్రీనివాస్ రెడ్డి అనే ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమ్మె తీవ్ర రూపం దాల్చింది. దీనిపై అఖిలపక్ష నేతలు స్పంధించారు. దీనిపై తెలంగాణ జనసమితి మాజీ ప్రొఫెసర్ కోదండరాం కూడా స్పంధించారు. 


Full View

Tags:    

Similar News