Kishan Reddy: టీబీజేపీలో ఎటువంటి మార్పులు ఉండవు
Kishan Reddy: ప్రస్తుతం ఉన్న టీంతోనే ఎన్నికలకు వెళతాం
Kishan Reddy: టీబీజేపీలో ఎటువంటి మార్పులు ఉండవు
Kishan Reddy: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై మరింత ఫోకస్ పెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా యుద్ధానికి సై అంటూ కాలుదువ్వుతోంది. ప్రస్తుతమున్న గులాబీ దళంతోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సై అంటోంది. తెలంగాణ బీజేపీలో నాయకత్వ సమస్యేలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. టీబీజేపీలో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండబోవని ఆయన తేల్చిచెప్పారు. ఇదే టీమ్‌తో రాబోయే ఎన్నికలను ఎదుర్కొని.. విజయం సాధిస్తామని ఆయన ధీమాగా చెప్పారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటామని, ప్రజలే తమకు అభ్యర్థులను ఇస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.