Kishan Reddy: నిధులు ఎలా సమకూర్చుకుంటారనే విషయంపై.. కాంగ్రెస్ దగ్గర రోడ్ మ్యాప్ లేదు
Kishan Reddy: మోడీ మరోసారి ప్రధానిగా గెలవబోతున్నారు
Kishan Reddy: నిధులు ఎలా సమకూర్చుకుంటారనే విషయంపై.. కాంగ్రెస్ దగ్గర రోడ్ మ్యాప్ లేదు
Kishan Reddy: బీఆర్ఎస్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్, కేసీఆర్‌కు భవిష్యత్ లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లుగా కుటుంబ పాలనను ప్రజలపై కేసీఆర్ రుద్దారని కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదన్నారు. నిధులు ఎలా సమకూర్చుకుంటారనే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద రోడ్ మ్యాప్ లేదని విమర్శించారు. పదేళ్లలో బీజేపీ పాలనలో దేశ ముఖచిత్రాన్ని మోడీ మార్చేశారని ఆయన కొనియాడారు. మరోసారి మోడీ ప్రధానిగా గెలవబోతున్నారని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.