డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి జయమ్మ మృతి

ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ కుడా డెంగ్యూ జ్వరంతో బాధ పడుతూ మృతి చెందారు.

Update: 2019-10-21 05:46 GMT

రాష్ట్రంలో ప్రబలుతున్న విశాజ్వరాలతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం జయమ్మ కుడా డెంగ్యూ జ్వరంతో బాధ పడుతూ మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితులు బాగాలేక హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు ప్రాంతంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె 2018 డిసెంబర్‌లో ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.

తెలంగాణా రాష్ట్రంలోని ఆస్పత్రులలో జనవరి నుంచి ఇప్పటి వరకు 4,500 కి పైగా డెంగ్యూ కేసులు, మూడు లక్షలకు పైగా వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజారోగ్య విభాగం, ఇతర పౌర సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ జ్వరాలపైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆగస్టు-సెప్టెంబరులో 1,000 వైరల్ జ్వరాల కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య విభాగం నిపుణులు తెలుపుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే ఎలాంటి జబ్బులు రావని వారు తెలిపారు.


Tags:    

Similar News