KCR: సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

KCR: యాసంగి జొన్నపంటను మద్ధతుధరతో.. ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

Update: 2023-05-12 13:36 GMT

KCR: సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

KCR: తెలంగాణలో యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. యాసంగి సీజన్‌లో పండించిన జొన్నల పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మార్క్‌ఫెడ్‌ ఎండీకి సూచించింది.

యాసంగి సీజన్లో పండిన మొత్తం 65 వేల 494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.. ఇందుకు కావాల్సిన 219.92 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో..ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న సాగు చేసిన దాదాపు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

Tags:    

Similar News