KCR: బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
KCR: విభజన హామీల కోసం పార్లమెంటులో కొట్లాడాలి
KCR: బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
KCR: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగిస్తే నష్టపోతామని.. మనం ఏం చేశామో.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదమేంటో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను.. పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్‌లో కొట్లాడాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మరోసారి ఎంపీలతో సమావేశమవుతానన్నారు కేసీఆర్.