KCR ఆరోగ్యం విషమం: యశోద హాస్పిటల్‌కు తక్షణ తరలింపు – బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన
KCR ఆరోగ్యం విషమం: యశోద హాస్పిటల్‌కు తక్షణ తరలింపు – బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన
KCR health condition : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంటల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో గురువారం సాయంత్రం హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా యశోద వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య స్థితిపై పూర్తి సమాచారం తీసుకున్నారు.
కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
ఈ సమయంలో ఆయనతో పాటు సతీమణి శోభ, బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాతగా పేరొందిన కేసీఆర్‌కు ఏమీ కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.