కేసీఆర్ తీసుకున్న జీతం రూ. 57 లక్షలు: రేవంత్ రెడ్డి

ఎన్నికైన తర్వాత కేసీఆర్ శాసనసభకు వచ్చింది రెండుసార్లు మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు.

Update: 2025-03-15 13:32 GMT

కేసీఆర్ తీసుకున్న జీతం రూ. 57 లక్షలు: రేవంత్ రెడ్డి

ఎన్నికైన తర్వాత కేసీఆర్ శాసనసభకు వచ్చింది రెండుసార్లు మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో సీఎం ప్రసంగించారు. డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కేసీఆర్ కు రూ. 57 లక్షల 84 వేల 124 జీత భత్యాల రూపంలో ప్రభుత్వం చెల్లించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

దాదాపు 15 నెలలుగా జీత భత్యాల రూపంలో ప్రభుత్వం సొమ్ము అని సీఎం తెలిపారు.కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. 15 నెలల పాటు సభకు రాకున్నా కేసీఆర్ జీతభత్యాలు పొందుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News