మోడీ షెడ్యూల్‌లో సీఎం కేసీఆర్ పేరు చేర్చిన పీఎంఓ.. కేసీఆర్ ప్రసంగానికి 7 నిమిషాల సమయం
PM Modi Tour: మోడీ టార్గెట్ గా కేంద్రంపై కేసీఆర్ చాలా కాలంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు.
మోడీ షెడ్యూల్‌లో సీఎం కేసీఆర్ పేరు చేర్చిన పీఎంఓ.. కేసీఆర్ ప్రసంగానికి 7 నిమిషాల సమయం
PM Modi Tour: మోడీ టార్గెట్ గా కేంద్రంపై కేసీఆర్ చాలా కాలంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. వేదిక ఏదైనా కేసీఆర్ మోడీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశానికి ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పెట్టిన తర్వాత రాష్ట్రం బయట నిర్వహించిన బహిరంగ సభల్లో విమర్శల డోస్ పెంచారు. చాలా కాలంగా మోడీ టూర్లకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇవాళ్టి టూర్‌కు కూడా సీఎం కేసీఆర్ దూరంగానే ఉండనున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సీఎంవో నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
తెలంగాణలో మోడీ పర్యటనలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాలకు సైతం మంత్రులను మాత్రమే పంపిస్తున్నారు. ఇక ప్రధాని వచ్చినప్పుడు తప్పనిసరిగా సీఎం మాత్రమే స్వాగతం పలకాల్సి ఉంటుంది. ముచ్చింతల్‌లో జరిగిన సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో స్నాతకోత్సవంతో పాటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కార్యక్రమాలకు ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చారు. అయితే ప్రతీ సందర్భంలోనూ ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లకుండా మంత్రి తలసానికి పంపిస్తున్నారు. ఈసారి కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు తలసానినే పంపనున్నట్లు తెలుస్తోంది.
ప్రోటోకాల్ ఇష్యూతోనే కేసీఆర్ ప్రధానిని కలిసేందుకు ఆసక్తి చూపడం లేదు. మోడీ ప్రోటోకాల్ పాటించలేదని.. అందుకే సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న సమయంలో జీనోమ్ వ్యాలీకి వచ్చారు ప్రధాని. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదని అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత పర్యటను వచ్చిన ప్రతీసారి కేసీఆర్‌కు ఆహ్వానం పంపుతున్నా గులాబీ బాస్ మాత్రం స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదు.