Teenmar Mallanna: మహిళలపై దారుణ వ్యాఖ్యలు.. సస్పెండ్ చేయాలి – కవిత ఆగ్రహం

తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా తనపై తీవ్రస్థాయిలో దూషణలకు పాల్పడిన మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని,శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

Update: 2025-07-13 13:16 GMT

Teenmar Mallanna: మహిళలపై దారుణ వ్యాఖ్యలు.. సస్పెండ్ చేయాలి – కవిత ఆగ్రహం

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళగా తనపై తీవ్రస్థాయిలో దూషణలకు పాల్పడిన మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని,శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, మల్లన్నపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“ఇది తెలంగాణ… ఇక్కడ ఆడబిడ్డలకు గౌరవం ఉంటుంది”

"తెలంగాణలో మహిళల పట్ల ప్రత్యేక గౌరవం ఉంది. బోనం ఎత్తే ఆడబిడ్డను అమ్మవారిలా చూస్తారు. ఇటువంటి రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి పరుష పదజాలంతో మహిళల్ని దూషిస్తే, రాజకీయాల్లోకి రానున్న ఇతర మహిళలకు అది భయానక సంకేతంగా మారుతుంది," అని కవిత అన్నారు.

"ఏమాత్రం కారణం లేకుండా దూషణలు"

"తీన్మార్ మల్లన్న దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నిన్ను ఏ రోజు కూడా విమర్శించలేదు. మేము దాదాపు ఏడాదిన్నర నుంచి బీసీ హక్కుల కోసం తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తున్నాం. అలాంటప్పుడు ఇలా మాట్లాడటం ఎందుకు?" అంటూ ఆమె ప్రశ్నించారు.

జాగృతి కార్యకర్తల నిరసన – పోలీసులు కాల్పులు?

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడానికి జాగృతి కార్యకర్తలు వెళ్లగా, పోలీసులు కాల్పులకు దిగడం దారుణమని కవిత విమర్శించారు. "ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజల జీవితాలు, ఆశలు ఉంటాయి. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ను కలుస్తాం. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి" అని డిమాండ్ చేశారు.

డీజీపీకి ఫిర్యాదు – భారీ బందోబస్తు

ఈ అంశంపై కవిత డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News