Kaushik Reddy: ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది.. కేసీఆర్ ఆట చూస్తారు
Kaushik Reddy: అబద్ధాల పునాదులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు
Kaushik Reddy: ఇప్పటి నుంచి ఆట మొదలవుతుంది.. కేసీఆర్ ఆట చూస్తారు
Kaushik Reddy: కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇప్పటి నుంచి ఆట మొదలవుతుందని, కేసీఆర్ ఆట చూస్తారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నర్సింగ్ స్టాఫ్‌కు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు గత ప్రభుత్వంలో పరీక్షలు రాసి ఇచ్చినవేనని తెలిపారాయన.
సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటో తేదీన ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. అబద్ధాల పునాదులతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కేసీఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో నిరూపిస్తే అసెంబ్లీ సాక్షిగా తన ముక్కు నేలకు రాసుకుంటానని కౌశిక్ రెడ్డి అన్నారు.