కల్యాణలక్ష్మి సాయం పెంపు.. వాళ్లకు మాత్రమే!

Update: 2019-06-29 12:36 GMT

తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద వివాహం కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దివ్యాంగులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా అందించే సహాయం పెరిగింది. సాధారణ లబ్ధదారుల కంటే దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25శాతం అధిక సహాయం అందించనుంది. కేంద్ర చట్టానికి లోబడి ఆర్థిక సహాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. సాధారణ కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు రూ.1,00,116 అందిస్తున్నారు. ఇక నుంచి దివ్యాంగులైన పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25,145 నగదు పడనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  

Tags:    

Similar News