Rajaiah: కడియం శ్రీహరి ఓ అవినీతి తిమింగళం.. అవసరమైనపుడు పుస్తకాన్ని తెరుస్తా

Rajaiah: కడియం అవినీతి అక్రమాల చరిత్రంతా తెలుసు

Update: 2023-07-10 04:33 GMT

Rajaiah: కడియం శ్రీహరి ఓ అవినీతి తిమింగళం.. అవసరమైనపుడు పుస్తకాన్ని తెరుస్తా

Rajaiah: ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం, రాజయ్య మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరి ఓ అవినీతి తిమింగళం అన్నారు. కడియం అవినీతి అక్రమాల చరిత్రంతా తనకు తెలుసని.. అవసరమైనప్పుడు ఆ పుస్తకాన్ని తెరుస్తానన్నారు. గతంలో ఏమీ లేని కడియం శ్రీహరికి.. ఇప్పుడు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చాటుమాటు మీటింగ్‌లు ఎందుకు ప్రజల్లోకి రావాలని.. నువ్వో నేనో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఘన్‌పూర్ రాజయ్య అడ్డా అని.. గెలిచేది తానేనని స్పష్టం చేశారు.

Tags:    

Similar News