Robin Hood: పెద్దలకు దగ్గర కొట్టి పేదలకు పంచే రాబిన్ హుడ్
Robin Hood: దొంగతనం చేసిన డబ్బుతో గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేయించిన మహ్మద్ ఇర్ఫాన్
Robin Hood: పెద్దలకు దగ్గర కొట్టి పేదలకు పంచే రాబిన్ హుడ్
Robin Hood: అతనొక రాబిన్ హుడ్.. పెద్దలను కొట్టి పేదలకు పంచుతాడు. చోరీలు చేసేందుకు ముందుగా ఆధునిక సాంకేతికత సాయం తీసుకుంటాడు. ఖరీదైన ప్రాంతాలపై కన్నేస్తాడు. సెల్ఫోన్, చెప్పులు ఉపయోగించడు. చోరీ సమయంలో కెమెరా కళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. పేరుమోసిన ఇలాంటి అంతర్రాష్ట్ర దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు.
బిహార్ లోని గర్హ సమీప జోగియా గ్రామానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ఈ నెల 8న హైదరాబాద్ లక్షీకాపూల్లోని మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్ దిగాడు. జూబ్లీహిల్స్ రోడ్ 45లో ఓ సినీప్రముఖులు నివసించే ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహించాడు. దొంగతనానికి అనుకూలంగా లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్లాడు. ధృవ అనే ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి 5 లక్షల రూపాలయ రుద్రాక్షతో కూడిన బంగారు గొలుసు చోరీ చేసి ముంబయి పరారయ్యాడు.
పోలీసులు 75 కెమెరాల పుటేజీ పరిశీలించినా నిందితుడి ఆచూకీ లభించలేదు. వెంకటగిరి ప్రాంతంలోని సీసీ కెమెరాలో ఆగంతకుడి ఆనవాళ్లు కనుగొన్నారు. అతను మళ్లీ నగరానికి వచ్చి మెరిడియన్ గోల్డెన్ లాడ్జిలో దిగినట్టు తెలుసుకున్న పోలీసులు శుక్రవారం యూసపన్ గూడ చెక్ పోస్టు దగ్గర అతన్ని పట్టుకున్నారు. డిల్లీలో 4, హైదరాబాద్ లో నాలుగు, బెంగళూరులో ఏడు కేసుల్లో నిందితుడు. ఇతని నుంచి ఒక పెద్ద స్క్రూడ్రైవర్, చిన్న స్క్రూడ్రైవర్, జియో డాంగిల్, టెక్నో స్మార్ట్ సెల్ఫోన్, ఆకుపచ్చ రంగు మంకీ క్యాప్ ఉండే చొక్కా, నలుపు రంగు టోపీ స్వాధీనం చేసుకున్నారు.
రాబిన్ హుడ్ ముంబయిలో బ్యాగులు కుడుతూ వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడుతుంటాడు. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి వేగంగా దూకుతూ వెళ్లడం, రెక్కీ నిర్వహించే సమయంలో సీసీ కెమెరాలపై నిఘా పెట్టడం, ఖరీదైన కారు చోరీ చేసి అందులోనే దొంగతనాలకు వెళ్లడం చేస్తాడు. చోరీ సొమ్ములో అత్యధిక భాగం సొంతూరిలో రైతులకు, పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తుంటాడు. తాను చోరీ చేసిన సొమ్ముతో ఊరిలో విద్యుత్ స్తంభాలు వేయించి వెలుగులు వచ్చేలా చేయడంతో గ్రామస్థులు అతనికి ఉజ్వల్ అని పేరు పెట్టినట్లుట్టు పోలీసు విచారణలో వెల్లడైంది.
కేవలం బంగారం, నగదు, వజ్రాలే చోరీ చేస్తాడు. వెండి వస్తువుల జోలికి వెళ్లడు. మొదటి భార్య ఉండగా ముంబయి పబ్లో బార్ గర్ల్ గా పనిచేసే గుల్షన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కోల్ కతకు చెందిన మరో యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే పూజ అనే మరో యువతితో ప్రేమలో పడి ఆమె పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించాు.