Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు.

Update: 2025-06-08 01:43 GMT

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈనెల 5వ తేదీ ఆయన గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు.

మాగంటి గోపీనాథ్ 2014లో తొలిసారిగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

Tags:    

Similar News