KTR: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక

KTR: జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని రహమత్‌నగర్‌లో ఆయన సమావేశం నిర్వహించారు.

Update: 2025-10-13 10:41 GMT

KTR: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక

KTR: జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లోని రహమత్‌నగర్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు. గత ఎన్నికలో కాంగ్రెస్ నుంచి అజహారుద్దీన్ పోటీ చేశారు. అజహారుద్దీన్‌కు ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడదనే విషయం రేవంత్‌కు తెలుసన్నారు.

ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మోసాలను బాకీ కార్డులతో ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. కాంగ్రెస్‌ను హైదరాబాదీలు నమ్మలేదు, అందుకే ఎన్నికలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఇళ్ళు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..అని కేటీఆర్ ప్రశ్నించారు.

Tags:    

Similar News