Jubilee Hills Bypoll: నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీత
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో తన నామపత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు.
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న మరణించారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే సతీమణి అయిన మాగంటి సునీతకు BRS అధిష్టానం బీఫామ్ ఇచ్చింది. ఈ ఉపఎన్నికకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా, కౌంటింగ్ నవంబర్ 14న చేపడతారు.