Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి

Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ (భాజపా) తన అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డిని ప్రకటించింది.

Update: 2025-10-15 06:29 GMT

Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ (భాజపా) తన అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డిని ప్రకటించింది. 2023 సాధారణ ఎన్నికల్లోనూ ఆయన జూబ్లీహిల్స్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం దీపక్‌రెడ్డి హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే, BRS నాయకుడు మాగంటి గోపీనాథ్‌ ఈ ఏడాది జూన్‌ 8న అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణం కారణంగా ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.

ఉపఎన్నిక పోలింగ్‌ నవంబర్ 11న జరగనుండగా, కౌంటింగ్ నవంబర్ 14న చేపట్టనున్నారు.

Tags:    

Similar News