Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికకు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత వెంకటగిరిలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో దీపక్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు.
ఇప్పటికే కాగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. రాజకీయ నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీస్ వద్ద ఉత్కంఠ వాతావరణ నెలకొంది.