Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైంది.
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో ఈ సారి పోలింగ్ శాతం గతం కంటే పెరిగే అవకాశం ఉంది.
ఇక.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. 139 పోలింగ్ స్టేషన్లలో 139 డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లతో పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగుతుంది.