దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్ననిరుద్యోగ యువతకు శుభవార్త.

Update: 2019-11-30 10:07 GMT
South central Railway

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్ననిరుద్యోగ యువతకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 4103 రైల్వే అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 8 చివరి తేదీ.

ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రాంతావారిగా చూసుకుంటే

లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లో ఈ యూనిట్లు ఉన్నాయి.

ఖాళీల సంఖ్య 

మొత్తం ఖాళీలు 4103

ఫిట్టర్- 1460

ఎలక్ట్రీషియన్- 871

డీజిల్ మెకానిక్- 640

వెల్డర్-597

ఏసీ మెకానిక్- 249

ఎలక్ట్రానిక్ మెకానిక్- 102

మెకానిస్ట్- 74

పెయింటర్- 40

ఎంఎండబ్ల్యూ- 34

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18

కార్పెంటర్- 16

ఎంఎంటీఎం- 12

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 వరకు దరఖాస్తుల స్వీకరణకు ముగింపు కానున్నాయి.

అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50% మార్కులతో 10వ తరగతి మరియు ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు రూ.100.

వయోపరిమితి

15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు సడలింపు

ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు

వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను చూడడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. 

Tags:    

Similar News