టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌పై కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని జీవితా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుణశేఖర్ కు చెందిన షాపు ముందు కౌశిక్ రెడ్డి కారు పార్కింగ్ చేశాడని. షాపు ముందు కారు తీసేయాలని కోరడంతో గుణ పై కౌశిక్ రెడ్డి దాడికి దిగాడని గుణశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు ముందున్న సీసీ ఫుటేజీని సేకరించి ఆధారాలతో సహా బంజారాహిల్స్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. గుణతో పాటు జీవితా రాజశేఖర్ కూడా ఉన్నారు. ఫిర్యాదు అనంతరం జీవిత మాట్లాడారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరినట్టు వెల్లడించారు.