తెలంగాణలో ఎన్నికల చిత్ర, విచిత్రాలు
Jeevan Reddy: ఓటర్లకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల తాయిళాలు
తెలంగాణలో ఎన్నికల చిత్ర, విచిత్రాలు
Jeevan Reddy: ఎన్నికల చిత్రాలు మాములుగా ఉండవ్. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టంట్లు ప్లే చేస్తుంటారు. కొంతమంది ఓటర్లకు దండాలు పెడుతుంటారు. కాళ్లు మొక్కుతుంటారు. ఇంకొందరు ఎన్నికల తాయిళాలను ఎరగా వేస్తుంటారు. ఐతే ఎన్నికల వేళ ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచారు. మహిళలకు చీరలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గంలోని ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో 80కి పైగా గ్రామాల్లో జీవన్ రెడ్డి పేరుతో ప్రతి ఇంటా రైస్ కుక్కర్లు దర్శనం ఇవ్వడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్‌కు ముందుగానే 70శాతం పంపిణీ చేసి, తర్వాత మిగిలిన వాటిని సరఫరా చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఓటర్లు చేజారకుండా ఎన్నికల తాయిళాలతో ఇలా వారిని ఖుషీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా..ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..రూటే సపరేట్.. ప్రత్యర్థులపై విరుచుకుపడడమే కాదు.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో కూడా అన్నకు మస్తు తెలుసు అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.