ఢిల్లీ పర్యటనలో ఉపరాష్ట్రపతిని కలిసిన కేటీఆర్

Update: 2019-11-28 02:38 GMT
మంత్రి కేటీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ నేపధ్యంలోనే బుధవారం ఉదయం మేఘాలయ సీఎం సీకే సంగ్మాను కలిసారు. ఆయన్ని కలిసిన కేటీఆర్ కొన్ని ముఖ‌్యమైన విషయాల గురించిన మాట్లాడుకున్నారు. చర్చ ముగిసిన అనంతరం సీకే సంగ్మా సామజిక మాద్యమాల ముందు కేటీఆర్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని  తెలిపారు. అనంతరం బుధవారం సాయంత్రం కేటీఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంలోనే గురువారం మంత్రి కేటీఆర్ గిరిజన యువతకోసం గురువారం ప్రారంభించనున్న పథకాన్ని గురించి తెలిపారు. గిరిజన యువతను ముందంజలో నడిపించడానికి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం 'సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌ స్కీం'ను రూపొందించింది. ఈ పథకాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా చాలా మంది గిరిజన యువత తమలో ఉన్న టాలెంట్ ను బయటికి తీసుకొచ్చి మంచి స్థాయికి ఎదగాలన్న ఆశయంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు.


Tags:    

Similar News