Rain Alert: హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు
Rain Alert: జలమయమైన లోతట్టుప్రాంతాలు, అలర్ట్ అయిన జీహెచ్‌ఎంసీ అధికారులు
Rain Alert: హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు
Rain Alert: హైదరాబాద్‌లో మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్తాపూర్ నుంచి వనస్థలిపురం వరకు హయత్ నగర్ నుంచి మణికొండ వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో రోడ్లపైనే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా వానలు పడుతుండడతో ghmc అలర్ట్ అయింది. ఇప్పటికే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక టీంలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షం ప్రభావం తగ్గే వరకు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారు. రోడ్ల మీద ఆగిన నీళ్లను నాలాల్లోకి పంపుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో చాలా చోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈదురుగాలులకు పెద్ద చెట్లు, స్తంభాలు కూలి పోయాయి. మియాపూర్ ప్రాంతంలో కూలిన చెట్లను DRF సిబ్బంది తొలగిస్తున్నారు.