జూనియర్ కాలేజీల్లో అకాడమిక్ తనిఖీలు.. నవంబర్ 15లోగా పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశం..!
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో అకాడమిక్ తనిఖీలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో అకాడమిక్ తనిఖీలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. నవంబర్ 15 వరకూ తనిఖీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు, ప్రైవేటు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు.. ఇలా అన్ని ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు చేసేందుకు షెడ్యూల్ రిలీజ్ చేశారు.
కాలేజీల్లో ప్రమాణాలను మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వీటి బాధ్యతను స్పెషల్ ఆఫీసర్లు, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీలు, డీఐఈఓలకు అప్పగించారు. కాలేజీ నిర్వహణ తీరు, రికార్డులను తనిఖీ టీములు పరిశీలించనున్నాయి. కాలేజీల సంస్థాగత రికార్డులు, సిబ్బంది వివరాలు, విద్యార్థుల అటెండెన్స్, అకాడమిక్ మాడ్యూల్స్కు అనుగుణంగా నిబంధనలు అమలు చేస్తున్నారో లేదో పరిశీలించనున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను ఇంటర్ బోర్డుకు పంపించాలని కృష్ణ ఆదిత్య ఆదేశించారు.