తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Update: 2019-11-29 15:00 GMT

తెలంగాణ ఇంటర్ విద్యార్థుల పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. 2020 మార్చి 4వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 23 వరకు జరగనున్నాయని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ తెలిపింది.

ఇక ఫైనల్ పరీక్షలు జరగడానికి ముందుగా జరిగబోయే ప్రాక్టికల్స్ ను ఫిబ్రవరి 1నుంచి 20వరకు నిర్వహించనున్నామని తెలిపారు. ఇక పోతే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలను జనవరి 28న, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలను జనవరి 30న నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ప్రకటించింది.


Tags:    

Similar News