తెలంగాణలో నేడు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-23 09:17 GMT
Inter board exam postponed Today

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇటీవలే కోర్టు ఆదేశాను సారం ప్రభుత్వం పదోతరగతి పరీక్షలు వాయిదా వేసారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఈ రోజు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజున నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్టు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనాను కట్టడి చేసే నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామని విషయాన్ని మార్చి 31 తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. దాంతో పాటుగానే ఈ రోజు 12 కేంద్రాల్లో జరుగుతున్న స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా వాయిదా వేసినట్టు వారు తెలిపారు.

వాయిదా పడిన పరీక్ష పేపర్లు...

మోడ్రన్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ 2

మోడ్రన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్ 2

మోడ్రన్ లాంగ్వేజ్ ఉద్దూ పేపర్ 2

మోడ్రన్ లాంగ్వేజ్ హిందీ పేపర్ 2

జాగ్రఫీ పేపర్ 2

Delete Edit



Tags:    

Similar News