ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హై కోర్టులో విచారణ

Update: 2019-11-14 03:08 GMT

41వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల ఎదుట కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీసులో జేఏసీ, అఖిలపక్షం నాయకులు సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

మరోవైపు 5, 100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హై కోర్టులో విచారణ జరగనుంది. రూట్ల ప్రైవేట్ పై క్యాబినేట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు సే ఇచ్చింది. ఈ విషయంపై క్యాబినేట్ ప్రొసిడింగ్స్ ను ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. ఆర్టీసీ కార్పొరేషన్ కౌంటర్ దాఖలు చేసింది. రూట్ల ప్రైవేట్ పై రెండు వర్గాల మధ్య వాదనలు ఇవాళ కొనసాగనున్నాయి.  

Tags:    

Similar News