Indiramma House: ఇందిరమ్మ ఇళ్లు కోసం దరఖాస్తు చేశారా.. ఇలా చెక్ చేసుకోండి.
Indiramma House: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం దాదాపు 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్ లో వివరాలు నమోదు చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలు, మున్సిపాటిల్లో ప్రతి 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో సర్వేయర్లుగా వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని నియమించారు. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లలో తమ వివరాలు సరిగ్గా నమోదు చేశారా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ సందేహాన్ని నివ్రుత్తి చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఇందిరమ్మ ఇళ్లు వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://indirammaindlu.telangana.gov.in/applicantSearch వెబ్ సైట్ లో నమోదు చేశారు.
వెబ్ సైట్ లో ఇందిరమ్మ ఇళ్లు పోర్ట్ ఓపెన్ అవ్వగానే కుడివైపున హోం అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో అప్లికేషన్ సెర్చ్ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సెర్చ్ ఓపెన్ అయ్యాక దానిలో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్,అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్ఐ కార్డ్ నెంబర్ అనే 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ వివరాలను ఎంటర్ చేసి దరఖాస్తుదారు వివరాలు కనిపిస్తాయి. దీంతో తమ దరఖాస్తు ప్రభుత్వం వద్ద నమోదు అయిందా లేదా అనే సందేహాలు తీరుతాయి.
తమ దరఖాస్తు సర్వే చేసిన వారి వివరాలు కూడా అందులో ఉంటాయి. దీనిద్వారా తమ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా పారదర్శకతకు పెద్దపీఠ వేయాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు తెలుసుకోవచ్చు.