Bharosa Scheme: మహిళలకు అదిరిపోయే వార్త..బ్యాంక్ అకౌంట్లోకి రూ.6వేలు ఎప్పట్నుంచో తెలుసా?

Update: 2025-01-24 12:03 GMT

Bharosa Scheme: రాష్ట్రంలోని మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయ్. ఒక్కోక్కరికి రూ. 6వేలు వస్తాయట. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎలాంటి భూమి లేని వారికి భరోసా అని పేరుతో కొత్త స్కీము తీసుకువచ్చింది. ఇందులో 12 వేల రూపాయల భరోసా కోసం ఈజిఎస్ ఉపాధి పనులు రోజు వారిగా పనులు చేసే వారికి ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి కూలీలు సైతం 100 రోజుల పని ఉంటే కచ్చితంగా ఆ కుటుంబమంతా కూడా 100 రోజుల పని పూర్తి చేస్తున్నారు. ఈ కొత్త పథకం భరోసా పెట్టడం వల్ల కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో బయట కూలీ చేసుకుంటే 1000 రూపాయల నుంచి 1200 వరకు కూలీ వస్తుంది.

ఇలాంటి సమయంలో ఈజీఎస్ ఉపాధి హామీ పనులు 12 రోజుల పాటు పనిచేస్తే వారికి సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. కూలీలు రెండు చేతుల కష్టం చేస్తే సంసారం నడవలేని పరిస్థితి ఉంది. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.అలాంటి వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఎంపిక చేస్తున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు.

ఒక గుంట కూడా భూమి ఉండకూడదు. ఇలాంటి 25, 032 మంది కూలీలను జిల్లా అధికారులు గుర్తించి జిల్లాలవారీగా లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. వారి ఖాతాలో 6 నెలలకు ఒకసారి విడతల వారీగా సంవత్సరంలో రెండుసార్లు 12 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కో విడత 6000 మరో విడత 6000 రూపాయలు సంవత్సరం మొత్తం 12 వేల రూపాయలు ఇచ్చే విధంగా మార్గదర్శకాలు అనుగుణంగా ఆర్థిక సహాయం జాబితా తయారు చేశారు. కూలీలు ఉపాధి హామీలు కనీసం 12 రోజుల నుండి 20 రోజుల వరకు చేసిన వారికి లబ్ధిదారులుగా గుర్తించారు. ఈ నెల 26 నుంచి తొలివిడత కింద 6000 కూలీల బ్యాంకులో జంకా వచ్చిన తెలుస్తోంది.

Tags:    

Similar News