రేపటి నుంచే కొత్త చార్జీల అమలు

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు కార్మికులు సరిగ్గా దసరా, దీపావళి పండగల సమయంలోనే సమ్మె బాట పట్టారు.

Update: 2019-12-01 10:50 GMT

ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. దానికి తోడు కార్మికులు సరిగ్గా దసరా, దీపావళి పండగల సమయంలోనే సమ్మె బాట పట్టారు. అదీ ఒకటీ, రెండు రోజులు కాదు ఏకంగా 52 రోజుల పాటు సమ్మెను చేసారు. ఈ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్‌ లను, కండక్టర్ లను పెట్టి బస్సులను నడిపించింది. వారికి రోజువారి వేతనంగా డ్రైవర్‌లకు రూ.1500, కండక్టర్‌లకు రూ.1000 చెల్లించింది. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగానే చిల్లు పడి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు నిధులను విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నిధులు మంజూరు చేసినప్పటికీ ఆర్టీసీ నష్టాలనుంచి బయటపడదని తెలుసుకున్న ప్రభుత్వం సంస్థను గట్టెక్కించాలంటే ఛార్జీలు పెంచడమే సరైందని నిర్ణయానికొచ్చింది. ప్రయాణికులు ఆర్టీసీ చార్జీల పెంపును దృష్టిలో పెట్టుకోవాలని, అందుకు అందరూ మానసికంగా సిద్ధపడాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

పెంచిన చార్జీల విషయానికొస్తే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సిటీ, పల్లె వెలుగు బస్సులో కనీస చార్జీ రూ.10గా నిర్ణయించే అవకాశముందని తెలిపారు. ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెరగనున్నాయి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను రేపటి నుంచే అమల్లోకి తీసుకురానున్నారని తెలిపారు.

Tags:    

Similar News